[caption id="attachment_5531" align="alignright" width="2560"]
నిజామాబాద్:
డిచిపల్లి మండలం కేశాపూర్ రోడ్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా, నిర్మాణంలో ఉన్న ప్రమాదకరమైన భవనంలో చట్టవిరుద్ధంగా నడుస్తున్న నారాయణ ఇంటర్మీడియట్ కళాశాలను వెంటనే సీల్ చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్డి మాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు మరియు DIEO ఇచ్చినా అనుమతులు లేవనే నివేదికల ప్రతులను వినతిపత్రానికి (Memorandum) జతపరిచి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్‌కు TGVP నాయకులు సమర్పించారు.
కళాశాల యాజమాన్యంతో నిజామాబాద్ DIEO కుమ్మక్కై, అధికారుల తనిఖీల సమయానికి ముందే సమాచారమిచ్చి విద్యార్థులను సమీప పార్కులకు తరలిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ల స్పష్టమైన ఉత్తర్వులను సైతం పక్కనబెట్టి, భవనంలో విద్యార్థులు లేరంటూ తప్పుడు నివేదికలు ఇస్తున్న DIEO పై తక్షణమే శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.
లేకపోతే విద్యార్థులతో కలిసి ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో TGVP జిల్లా నాయకులు అఖిల్, మహేష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.[/caption]