కరీంనగర్: తెలుగు కే న్యూస్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అడవి జంతువులు, వీధి జంతువుల సేవకుడు సుమన్ కుమార్ పటేల్ కు అటవీ శాఖ సత్కారం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లా అటవీ శాఖ అధికారి స్ సత్యనారాయణ జిల్లా అటవీ అధికారి చేతుల మీదుగా `శ్రీ లక్ష్మి జంతు సంరక్షణ శాల వ్యవస్థాపకులు, ప్రసిద్ధ స్నేక్ రెస్క్యూర్ సుమన్ పటేల్ సర్వీస్ కు గాను ప్రశంసా పత్రం అందజేశారు.15 సంవత్సరాలుగా సుమన్ చేస్తున్న సేవలు అడవి జంతువులను జన ప్రాంతాల్లోకి వచ్చే పాములు, నెమళ్లు, కోతులు, నక్క, పునుగు పిల్లి ఇతర వన్యప్రాణులను సురక్షితంగా రక్షించి అటవీ శాఖకు అప్పగించడం పాముల కాపాడి జిల్లా వ్యాప్తంగా 1000 పాములను ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా రెస్క్యూ చేయడం తదితర జంతువులకు చికిత్స అందించడం మానవ సేవలోనూ ముందున్నారు సుమన్ గారి సేవలను గుర్తించిన అటవీ శాఖ వారు, ప్రజలు మరియు వన్యప్రాణుల మధ్య సంఘర్షణ తగ్గించడంలో సుమన్ పాత్ర అమూల్యమైనది అని కొనియాడారు. ఈ సందర్భంగా సుమన్ ప్రతి ప్రాణికి విలువ ఉంది. అడవిని కాపాడితేనే మనం బ్రతుకుతాం. అందరూ వన్యప్రాణులను కాపాడేందుకు ముందుకు రావాలి అని కోరారు సుమన్ సేవలను జిల్లా అటవీ అధికారులు స్థానిక ప్రజలు సామాజిక కార్యకర్తలు జంతు ప్రేమికులు అభినందించారు.