Logo
Date of Publish : 16 July 2026, 5:37 am
Editor : Katta Ravindar

అతి వేగమే ప్రమాదానికి కారణం.. బోలెరో బోల్తా, ఐదుగురు కూలీలకు గాయాలు

[caption id="attachment_3961" align="alignleft" width="2304"] నవీపేట్, జూలై 16: నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలం :-కోస్లీ గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరినాటు పనుల కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన కూలీలు కోస్లీ గ్రామానికి చెందిన డాంగే రాజబాబు పొలంలో పని ముగించుకుని బోలెరో వాహనంలో తిరిగి తమ నివాసానికి వెళ్తుండగా, గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.
వాహనాన్ని డాంగే రాజబాబు అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో అదుపు తప్పి రోడ్డుపక్కనున్న పొలంలో బోల్తా పడింది. ఈ ఘటనలో సంజీవ్‌తో పాటు మరో నలుగురు కూలీలు గాయపడగా, స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కూలీలను పనికి తీసుకొచ్చిన కోస్లీ గ్రామానికి చెందిన కోరపల్లి సురేష్ ఫిర్యాదు మేరకు, బోలెరో డ్రైవర్ డాంగే రాజబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )