Logo
Date of Publish : 03 August 2026, 6:08 am
Editor : Katta Ravindar

అబాకస్ ద్వారా *విద్యార్థుల్లో వేగవంతమైన ఘనన నైపుణ్యాలు.

 

ఆదిరెడ్డి సీఐ నల్లగొండ.

తెలుగు కే న్యూస్ ప్రతినిధి

అబాకస్ అంక గణితంలో నల్లగొండ విద్యార్థుల ప్రతిభ
అబాకాస్ శిక్షణ ద్వారా పిల్లల్లో ఏకాగ్రత జ్ఞాపకశక్తి వేగవంతమైన గణన నైపుణ్యాలు పెరుగుతాయని నలగొండ టూ టౌన్ సిఐ కె ఆదిరెడ్డి తెలిపారు .ఆదివారం నల్లగొండలోని ఎస్ఐపి అబాకస్ లో ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన ప్రాడాజీ పోటీలో నల్లగొండ నుంచి పాల్గొన్న విద్యార్థులకు అద్భుత ప్రతిభ కనబరిచారు వారికి నేడు సిఐ ఆది రెడ్డి గారు ట్రోఫీలు అందజేసి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబాకస్ ద్వారా పిల్లలలో ఏకాగ్రత జ్ఞాపకశక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్య లో రాణించాలని అన్నారు. మాదక ద్రవ్యాల కు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. తల్లిదండ్రులకు సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థుల నడవడిక ఉండాలని అన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలు తల్లిదండ్రులు ఇవ్వవద్దని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. సోషల్ మీడియాకు దూరంగా పిల్లలు ఉండాలని అన్నారు.
నల్లగొండ అబాకస్ ఇంచార్జి భవానీ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో రన్నరపుగా రిషిదర్ ,హరిణి, విరాట్ అజితేష్ రెడ్డి, మరియు ముప్పై ఐదు మంది విద్యార్థులకు రాష్ట్ర అవార్డులు వచ్చాయని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గా నల్లగొండలో అబాకస్ ఇనిస్ట్యూట్ నడుస్తుందని అన్నారు. విద్యార్థులు వేగవంతమైన లెక్కలు చేస్తారని అన్నారు. అబాకస్ ద్వారా కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ పెరుగుతుందని ఇది స్కూల్ ఎడ్యుకేషన్ కు సపోర్టుగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లా దేవేందర్ రెడ్డి యశ్వంత్ ,యూవిన్ రెడ్డి, స్వాతి కృష్ణ,గిరిబాబు ఎల్లయ్య వెంకటరెడ్డి, పరమేష్ కృష్ణ సుధీర్ రెడ్డి అబ్బాస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )