[caption id="attachment_6048" align="alignright" width="1200"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట, సెప్టెంబర్ 13: అభంగపట్నం గ్రామంలోని శివాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టే క్రమంలో ఆలయ పరిసరాలను పరిశీలించేందుకు వెళ్లిన గ్రామ పెద్దలకు ఓ అద్భుత దృశ్యం దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలో మూడు చెట్లు కలిసి పెరిగిన చోట గణపతి ముఖాకారం స్పష్టంగా కనిపించడంతో గ్రామస్థులు ఆశ్చర్యంతో పాటు భక్తి భావానికి లోనయ్యారు.
శివాలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి ముందు విఘ్నేశ్వరుని రూపం కనిపించడం శుభసూచకమని భావించిన గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు భక్తులు అక్కడికి చేరుకుని దర్శించుకున్నారు.
ఇది యాదృచ్ఛికంగా ఏర్పడిన ఆకారమా, లేక పరమేశ్వరుని సన్నిధిలో విఘ్నేశ్వరుడి దివ్య సంకేతమా అని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి గైని వసంత సతీష్‌తో పాటు గ్రామ పెద్దలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అభంగపట్నం శివాలయ ప్రాంగణంలో కనిపించిన ఈ అరుదైన దృశ్యం ప్రస్తుతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.[/caption]