[caption id="attachment_5876" align="alignright" width="1080"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట్, సెప్టెంబర్ 9 (ఎన్‌ఎస్ టీవీ): నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని:- కోస్లీ అలీసాగర్ ఎత్తిపోతల పథకం 50 ఏళ్ల సేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా పథకం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, భూపతి రేడ్డి, మండవ వెంకటేశ్వారావు ఇరిగేషన్ అధికారులు, రైతులు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతూ రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. గత ఐదు దశాబ్దాలుగా రైతుల వ్యవసాయాభివృద్ధికి ఈ పథకం కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు.
అలీసాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి కృషి చేసిన ఇంజినీర్లు, సిబ్బంది, రైతులను నాయకులు అభినందించారు. భవిష్యత్తులో కూడా రైతులకు నిరంతర సాగునీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమం అనంతరం పథకం ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, రైతుల సంక్షేమం కోసం ఆకాంక్షించారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకం 50 ఏళ్ల ప్రస్థానం రైతులకు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు.[/caption]