నిర్ణీత గడువులో ప్రజలకు ఇసుక అందించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, తెలుగు కేన్యూస్ ఆగస్టు 20: ఎస్ఎస్ఎస్ఎంఎస్ వెబ్సైట్ ద్వారా ఇసుక సరఫరా ప్రక్రియను చక్కగా, పారదర్శకంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను నియమించారు.గురువారం జైపూర్ వేలాల ఇసుక రీచ్‌ను తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇసుక సరఫరా, ఆన్లైన్ బుకింగ్ వంటి అంశాలను పరిశీలించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఇసుక పారదర్శకంగా, అధికారికంగా ఎస్ఎస్ఎంఎస్ వెబ్సైట్ ద్వారా సరఫరా ప్రక్రియ కొనసాగుతుంది. ఆన్లైన్లో ఇసుక బుక్ సుకున్న వినియోగదారులకు నిర్ణీత గడువులో ఇసుక అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.అనంతరం జాతీయ రహదారి 163జీ నిర్మాణ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని.ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.