బెజ్జంకి: తెలుగు కే న్యూస్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులను యువజన కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు కర్రావుల సందీప్, మానకొండూరు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి శానగొండ శరత్ కుమార్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యార్థులకు విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, భవిష్యత్ లక్ష్యాలపై మార్గనిర్దేశం చేస్తున్న ఉపాధ్యాయుల సేవలుఅభినందనీయమన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.