మంచిర్యాల, జూలై 2 (తెలుగు K24 న్యూస్):
ఉప్పల్ భాగాయిత్ భూ పోరాట కార్యక్రమానికి వెళ్తున్న తెలంగాణ రక్షణ సేన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు కార్యక్రమానికి బయలుదేరిన మంచిర్యాల ఇంచార్జ్ ఐద ప్రశాంత్, చెన్నూర్ ఇంచార్జ్ మేడి రాజశేఖర్, సంపత్‌ను గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని జైపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని నాయకులు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం కేటాయించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు