[caption id="attachment_5336" align="alignright" width="2560"]
తెలుగు కేన్యూస్ ఆగస్టు 27
గన్నేరువరంలో డబుల్ రోడ్డు నిర్మాణం కోసం గురువారం మండల కేంద్రంలో యువజన సంఘాల నాయకులూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... డబుల్ రోడ్డు ఉద్యమంతో ఎమ్మెల్యేగా గెలిచిన కవ్వంపల్లి సత్యనారాయణ అదే రోడ్డును నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈనెల 30న మండల కేంద్రంలో యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించే నిరాహార దీక్షలో పాల్గొని దీక్ష చేపట్టాలన్నారు. నిరాహార దీక్షకు ఎమ్మెల్యే సిద్ధమైతే తాము కూడా అండగా ఉంటామన్నారు. వెంటనే డబుల్ రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షకు అఖిలపక్షం– ప్రతిపక్షలు, మండలంలోని ప్రతి ఒక్కరు మద్దతు తెలిపాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాల్వ నాగరాజు, మచ్చ సాయి కృష్ణ,కాలువ శ్రీకాంత్, నక్క అరవింద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.[/caption]