
భీమారం: తెలుగు కే న్యూస్ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్ల శంకరయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ నాయకులు భీమారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వారు పోలీసులను కోరారు.బీఆర్‌ఎస్ నాయకుల ఆరోపణల ప్రకారం.. ఎమ్మెల్యే వీర్ల శంకరయ్య ఇటీవల కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నానని, వెయ్యి మందితో చావు డప్పు మోగిస్తానని వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలతో కేసీఆర్ నివాసాన్ని ముట్టడించి ఉద్రిక్త వాతావరణానికి కారణమయ్యారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వీర్ల శంకరయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు పోలీసులను కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ భీమారం మండల మాజీ అధ్యక్షుడు కె. రాజకుమార్, ధర్మారం సర్పంచ్ మణిదీప్, కాజిపల్లి వార్డు సభ్యుడు తాళ్ల వేణు, భీమారం మాజీ ఎంపీపీ సమ్మన్న, దంపూర్ మాజీ సర్పంచ్ మధునయ్య, మాజీ ఉపసర్పంచ్ సంతోష్, మాజీ వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.