Logo
Date of Publish : 18 July 2026, 1:24 pm
Editor : Katta Ravindar

ఎల్లమ్మ బజార్ రోడ్ వెడల్పు తగ్గించాలని కాలనీ వాసుల వినతి

హుస్నాబాద్, తెలుగు కే న్యూస్ జూలై 18:
హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ బజార్ రోడ్‌ను 70 అడుగులకు విస్తరించే ప్రతిపాదనను తగ్గించాలని కోరుతూ కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. రోడ్డు విస్తరణ వల్ల పేద కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జున రెడ్డి, బీఎస్పీ నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, అభివృద్ధిని తాము వ్యతిరేకించడం లేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలను పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )