కామారెడ్డి జిల్లా సెప్టెంబర్ 19 : k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శనివారం కపిల్ చిట్స్ ఫండ్స్ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధించి స్టిల్ ప్లేట్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కపిల్ చిఫ్ఫండ్స్ యజమాన్యం వివిధ భక్తులకు, ప్రజలకు పేపర్ ప్లేట్లలో భోజనం చేస్తే జీర్ణ కోశ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్లాస్టిక్ సంబంధించిన ప్లేట్లు వాడొద్దని ప్రజలకు కపిల్ చిట్ ఫండ్స్ యజమాన్యం తెలిపారు. ప్రతి ఒక్కరూ స్టిల్ ప్లేట్ లో భోజనం చేసి ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో కపిల్ చిట్ ఫండ్స్ యజమాన్యం, భక్తులు పాల్గొన్నారు.