కరీంనగర్, తెలుగు కే న్యూస్ ఆగస్టు 18: కరీంనగర్ నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఎత్తివేసి నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించనున్నారు.ఉదయం 10:30 గంటలకు బైపాస్ రోడ్డులోని డంపింగ్ యార్డ్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు.డంపింగ్ యార్డ్ కారణంగా ప్రజలకు ఎదురవుతున్న ఆరోగ్య, పర్యావరణ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కవర్ చేయాలని తెలంగాణ రక్షణ సేన కోరింది.