Logo
Date of Publish : 28 September 2026, 5:47 pm
Editor : Katta Ravindar

కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజనుల ధర్నా.. -హాజీపూర్ తాండా భూములకు పట్టా హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్

కామారెడ్డి జిల్లా సెప్టెంబర్28:k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తాండాకు చెందిన 70 గిరిజన కుటుంబాలకు భూములపై పట్టా హక్కు పత్రాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోతీరామ్ నాయక్ మాట్లాడుతూ.. హాజీపూర్ తాండాకు చెందిన గిరిజన కుటుంబాలు గత 60 సంవత్సరాలుగా సర్వే నంబర్ 66లో 40 ఎకరాలు, 176లో 13 ఎకరాలు, 177లో 40 ఎకరాలతో పాటు మరో 40 ఎకరాల పోడు భూమిని సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఇంతకాలంగా సాగులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క గుంట భూమికి కూడా పట్టా హక్కు పత్రాలు అందలేదన్నారు.అటవీ అధికారులు తండావాసులను భయభ్రాంతులకు గురిచేస్తూ కేసులు పెడతామని, జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన గిరిజనుల భూములను సర్వే చేసి హక్కు పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. తక్షణమే భూములపై సమగ్ర సర్వే నిర్వహించి 70 గిరిజన కుటుంబాలకు పట్టా హక్కు పత్రాలు అందించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు మోతీరామ్ నాయక్ తెలిపారు. గిరిజనులకు అన్యాయం జరిగితే గిరిజన సంఘం ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు చౌహాన్ వినోద్ నాయక్, ఎంపీటీసీ కిషన్ నాయక్, నరేష్ నాయక్, శంకర్ నాయక్, దేవుల నాయక్, సురేందర్ నాయక్, దేవి సింగ్, రెడ్డి నాయక్, బిఖ్యా నాయక్, ముద్రచా నర్సింగ్ నాయక్, తర్య నాయక్, లూనావత్ లాలు నాయక్, రామ్చంద్ నాయక్, సరియా నాయక్‌తో పాటు గిరిజన రైతులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )