Logo
Date of Publish : 03 July 2026, 11:20 am
Editor : Katta Ravindar

కవిత అరెస్టును ఖండించిన తెలంగాణ రక్షణ సేన

కరీంనగర్, జూలై 3 (K24 న్యూస్): తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకురాలు కుతాడి రజిత ఆధ్వర్యంలో తిగలగుంటపల్లికి చెందిన చిదురు సుశీలవాణి తెలంగాణ రక్షణ సేనలో చేరారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, కవిత అరెస్టు అక్రమమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను, ఉద్యమకారులను నిరాశపరిచిందని విమర్శించారు. ప్రజలే తగిన సమయంలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )