Logo
Date of Publish : 27 July 2026, 4:50 am
Editor : Katta Ravindar

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మహేంద్ర రెడ్డి తీవ్ర ఆగ్రహం.. మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని డిమాండ్

 

.అక్కన్నపేట జులై తెలుగు కే న్యూస్.26

అధ్యక్షుడు రామంచం మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటుతో పాటు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని గొప్ప హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని తీవ్రంగా విమర్శించారు.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రైతులకు సరైన విద్యుత్ సరఫరా అందడం లేదని, ఉచిత కరెంటు కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆయన అన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందక మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని, దీంతో పొలాలకు నీరు అందక రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆరోపించారు.
రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, ఉచిత కరెంటుతో పాటు నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిస్థితికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి బాధ్యత వహించాలని, నైతిక బాధ్యత స్వీకరించి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని, రానున్న ఎన్నికల్లో తమ ఓటుతో సమాధానం ఇస్తారని మహేంద్ర రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్, ప్రధాన కార్యదర్శి మడక రవికుమార్, బీజేపీ సీనియర్ నాయకులు చందుపట్ల నాగరాజు, అక్కన్నపేట మండల ఉపాధ్యక్షుడు బోనగిరి తిరుపతి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు గంగుల కుమార్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు గిరమల్ల రాజు, బీజేపీ నాయకుడు వేమగంటి తేజ తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )