Logo
Date of Publish : 01 July 2026, 11:05 am
Editor : Katta Ravindar

కామారెడ్డిలో రూ.93 కోట్ల తాగునీటి ప్రాజెక్టుకు మరో అడుగు

కామారెడ్డి: తెలుగు కే న్యూస్
కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో అమృత్ (AMRUT) పథకం కింద నిర్మించనున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పనులకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణానికి శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం రూ.93 కోట్లతో సమగ్ర తాగునీటి ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 9 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం ప్రణాళికలో ఉండగా, ఇప్పటికే 8 ట్యాంకుల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. విద్యానగర్‌లో స్థల సమస్య పరిష్కారంతో తొమ్మిదో ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
అలాగే పట్టణంలో సుమారు 100 కిలోమీటర్ల కొత్త తాగునీటి పైప్‌లైన్ పనులు కూడా పూర్తికావచ్చాయని, త్వరలో ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు అందించే లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తుందని షబ్బీర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )