Logo
Date of Publish : 29 September 2026, 4:55 pm
Editor : Katta Ravindar

కామారెడ్డి జిల్లాలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు.. -బాన్సువాడలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో కార్యక్రమం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ సెప్టెంబర్ 29 : k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు.శిక్షణ కార్యక్రమాన్ని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, TUWJ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా జర్నలిజంలో వృత్తి నైపుణ్యాల ప్రాధాన్యత, మారుతున్న మీడియా రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, వార్తల సేకరణ, సమాచారాన్ని ప్రజలకు సమర్థవంతంగా చేరవేసే విధానాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో మీడియా రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )