కామారెడ్డి, K24 న్యూస్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విద్యార్థి సేన డిమాండ్ చేసింది.
జిల్లా స్థాయి సమావేశంలో విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్త్మిర్కర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ, కళాశాలలో తరగతి గదులు, బెంచీలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, అధ్యాపకుల కొరత వంటి సమస్యలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే వెంకట్ రమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ అలీ ప్రత్యేక చొరవ తీసుకుని రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసి కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో విద్యార్థి సేన నాయకులు పాల్గొన్నారు.