Logo
Date of Publish : 26 July 2026, 11:05 am
Editor : Katta Ravindar

కార్గిల్ అమర జవాన్ల త్యాగాలు చిరస్మరణీయం: వలస సుభాష్ చంద్రబోస్

సిద్దిపేట తెలుగు కే న్యూస్  హుస్నాబాద్ పట్టణంలో కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన అమర జవాన్లకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల సేవలు చిరస్మరణీయమని, నేటి యువత దేశభక్తి, జాతీయ భావాలను అలవరచుకుని దేశ సేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. దేశ సరిహద్దుల్లో అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్న సైనికుల వల్లే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.
అనంతరం అమర జవాన్ల స్మారకార్థం రెండు నిమిషాల మౌనం పాటించి వారికి ఘనంగా నివాళులర్పించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )