Logo
Date of Publish : 10 July 2026, 1:25 am
Editor : Katta Ravindar

కువైట్‌లో యువకుడి దారుణ హత్య.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు

[caption id="attachment_3745" align="alignleft" width="1080"] నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండల :- పరిధిలోని సాంపల్లి తండాకు చెందిన బదావత్ గణేష్ అనే వ్యక్తి, కువైట్‌లో కొరట్‌పల్లి తండాకు చెందిన గుగ్లోత్ కైలాష్‌ను దారుణంగా హత్య చేసినట్లు కైలాష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కువైట్‌లో జరిగిన ఈ ఘటన అనంతరం కైలాష్ మృతదేహాన్ని ఎడారి ప్రాంతంలో గుంత తవ్వి పాతిపెట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో గణేష్ కుమారుడు కూడా సహకరించినట్లు ఆరోపించారు. అనంతరం గణేష్ తన కుమారుడిని కువైట్‌లోనే వదిలేసి భారత్‌కు పారిపోయి వచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ విషయంపై కైలాష్ కుటుంబ సభ్యులు డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో గణేష్‌పై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న గణేష్ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గణేష్ కుమారుడిని కువైట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న బదావత్ గణేష్ ఫోటోను విడుదల చేసిన కైలాష్ కుటుంబ సభ్యులు.. ఆయన ఆచూకీ ఎవరికైనా తెలిసినా, ఎక్కడైనా కనిపించినా వెంటనే డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )