Logo
Date of Publish : 21 July 2026, 3:02 am
Editor : Katta Ravindar

కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ దర్యాపూర్ తండాలో ఘనంగా సీత్లా భవాని పండుగ

[caption id="attachment_4210" align="alignleft" width="2560"] నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-దర్యాపూర్ తండాలో లంబాడీల ఆరాధ్య దైవమైన సీత్లా భవాని పండుగను మంగళవారం సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. లంబాడీ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను ప్రతి ఏడాది ఆషాఢ మాసంలోని మంగళవారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వ్యవసాయ పనుల ప్రారంభానికి సంకేతంగా భావించే ఈ వేడుకలో తండా సరిహద్దులోని పొలిమేర, కూడలి వద్ద సీత్లా భవానిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డప్పు వాయిద్యాల నడుమ పురుషులు కోళ్లు, మేకలతో ఊరేగింపుగా వెళ్లగా, మహిళలు, యువతులు బోనాలు ఎత్తుకుని సంప్రదాయ నృత్యాలతో వేడుకలో పాల్గొన్నారు. అమ్మవారికి గుగ్గిళ్లు (ఘుగ్రీ), లాప్సీ (పాయసం) నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోళ్లు, మేకలను బలిచ్చి వాటి పైనుంచి పశువులను దాటించారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని లంబాడీలు విశ్వసిస్తారు.
పెద్దమనిషి పూజారిగా వ్యవహరించి సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యుడు మెగావత్ ప్రేమ్ సింగ్, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు తండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )