[caption id="attachment_4996" align="alignright" width="1600"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట్: క్విట్ ఇండియా స్ఫూర్తితో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జైలు భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం నవీపేట్ మండల కేంద్రంలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారి మీదుగా ర్యాలీగా వచ్చిన నాయకులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు చౌరస్తాలో బైఠాయించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వీవీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. విత్తన సవరణ బిల్లు, విద్యుత్ సంస్కరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే విధానాన్ని విరమించుకోవాలని కోరారు.
నాయకులు నాయక్వాడి శ్రీనివాస్, దేవేందర్‌సింగ్, వసంత్ మాట్లాడారు. రాస్తారోకో చేస్తున్న నాయకులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షుడు మేకల ఆంజనేయులు, రైతు సంఘం మండల అధ్యక్షుడు చిన్న వడ్డన్న, కేవీపీఎస్ మండల కార్యదర్శి జి.గౌతమ్, అధ్యక్షుడు శివశంకర్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు మద్దేపల్లి గంగాధర్, భోజన్న, నరసయ్య, అనురాధ, దేవకి తదితరులు పాల్గొన్నారు.[/caption]