[caption id="attachment_5244" align="alignright" width="1080"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట: మండల ప్రజల సమస్యల పరిష్కారానికి నవీపేట ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నాగనాథ్ తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని పేర్కొన్నారు.
మండలంలోని ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో నాగనాథ్ సూచించారు.[/caption]