[caption id="attachment_5248" align="alignright" width="1080"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట: మండల కేంద్రంలోని ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో శనివారం పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో వెంకటరమణ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో నాగరాజు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమాల్లో ఆయా కార్యాలయాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.[/caption]