Logo
Date of Publish : 05 July 2026, 4:49 am
Editor : Katta Ravindar

కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సురేందర్ గంగాసముందర్‌లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు ప్రభుత్వ ఆర్థిక చేయూత – ఆనందం వ్యక్తం చేసిన కుటుంబాలు

[caption id="attachment_3568" align="alignleft" width="1080"] ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండల్గం గాసముందర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల తహసీల్దార్ (ఎమ్మార్వో), రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), గ్రామ సర్పంచ్ తొగారి గంగామణి మహేష్ సంయుక్తంగా చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అచ్చకారి లక్ష్మి–రాములు దంపతుల కుమార్తె రాణికి, బద్దం గంగామణి–శ్రీనివాస్ దంపతుల కుమార్తె అఖిలకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన కుటుంబానికి పారదర్శకంగా చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోతే చిన్న సాయన్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )