కామారెడ్డి జిల్లా : తెలుగు K24 న్యూస్ :
కామారెడ్డి పట్టణంలోని కేఆర్‌కే సన్‌షైన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయాన్ని బీజేపీ కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షుడు నేహాల్ సందర్శించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు మహమ్మద్ ఖలీలుల్లాను కలిసి గత 15 ఏళ్లుగా ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు.
మహిళా సాధికారత, బాలల సంక్షేమం, ఉచిత న్యాయ సహాయం, విద్యా సహాయం, ఆరోగ్య అవగాహన, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, పేదలకు ఆహార పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఖలీలుల్లా తెలిపారు. ఇప్పటివరకు 60 వేలకుపైగా ఉచిత భోజనాలు అందించినట్లు చెప్పారు.
ట్రస్ట్ సేవలను నేహాల్ అభినందిస్తూ, సమాజ సేవలో సంస్థ చేస్తున్న కృషి ఆదర్శప్రాయమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మరింత ఉపయోగపడాలని ఆకాంక్షించారు.