[caption id="attachment_6186" align="alignright" width="1080"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలం:- కోస్లీ గ్రామం పంచాయతీలో పోషణ మాసం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడీ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు పోషకాహారం ప్రాముఖ్యత, తల్లి–శిశు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా హాట్ కుక్ మీల్, సమతుల్య ఆహారం, శిశు సంరక్షణ అంశాలపై వివరించారు. పోషకాహార లోపం నివారణకు ప్రతి కుటుంబం పోషకాహార నియమాలను పాటించాలని సూచించారు. అనంతరం పోషణ ప్రతిజ్ఞ చేయించి, చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ బాబుసింగ్, ఉప సర్పంచ్ సందీప్, కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.[/caption]