Logo
Date of Publish : 20 September 2026, 7:41 pm
Editor : Katta Ravindar

గణపయ్యకు ప్రత్యేక పూజలు.. అన్నప్రసాద వితరణ

లక్షెట్టిపేట: తెలుగు కే న్యూస్
లక్షెట్టిపేట మున్సిపాలిటీ 13వ వార్డు ముల్కల గూడెంలో రైజింగ్ స్టార్ యూత్, శ్రీ సాయి గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ముల్కల గూడెం ప్రజలతో పాటు లక్షెట్టిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల ప్రజలు కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్, రైజింగ్ స్టార్ యూత్ అధ్యక్షుడు బిరుదుల సత్యనారాయణ మాట్లాడుతూ.. గణపతి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రైజింగ్ స్టార్ యూత్ ఉపాధ్యక్షుడు చిలువేరి ప్రేమ్ కుమార్‌తో పాటు మహంకాళి రంజిత్, బాబుజి బిరుదుల, వెంకటేష్, వేణుగోపాల్, సుద్దాల గణేష్, బిరుదుల మనోజ్ కుమార్, చిప్పకుర్తి అక్షయ్, ముల్కల నవీన్, కత్తెరపాక అరుణ్, సల్లం సాయిచంద్, సల్లం సాయి ప్రణయ్, కలమడుగు అజయ్ తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )