Logo
Date of Publish : 30 August 2026, 2:47 pm
Editor : Katta Ravindar

గన్నేరువరంలో ఉద్రిక్తత పోలీసు వలయాన్ని ఛేదించి యువజన సంఘాల నిరాహార దీక్ష.. పలువురి అరెస్ట్

గన్నేరువరం, ఆగస్టు 30 (తెలుగు కే న్యూస్):

గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించ తలపెట్టిన 24 గంటల నిరాహార దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ యువజన సంఘాల నాయకులు వివేకానంద విగ్రహం వద్దకు చేరుకుని దీక్షకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఉదయం 6 గంటల నుంచే గన్నేరువరం మండల కేంద్రంలో పోలీసులు భారీగా మోహరించి, అదనపు బలగాలతో పర్యవేక్షించారు. నిర్ణయించిన సమయానికి యువజన సంఘాల నాయకులు దీక్షా స్థలానికి చేరుకోగా పోలీసులు వారిని చెదరగొట్టి బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులకు, యువజన సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరగడంతో పలువురికి స్వల్ప గాయాలైనట్లు నాయకులు తెలిపారు. అనంతరం పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఎమ్మెల్యే రాజీనామా చేయాలి: యువజన సంఘాలు

యువజన సంఘాల అధ్యక్షుడు కాలువ నాగరాజు మాట్లాడుతూ.. గన్నేరువరం డబుల్ రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. రోడ్డు సమస్యపై ప్రశ్నిస్తున్న వారిని బెదిరింపులకు గురిచేస్తూ, పోలీసుల సహకారంతో అక్రమ కేసులు బనాయించి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టేందుకు పోలీసు శాఖను అనుమతి కోరినా అధికార బలంతో అనుమతులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టడం చేతకాని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.రాజకీయ పార్టీల మద్దతుయువజన సంఘాలు చేపట్టిన నిరాహార దీక్షకు బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐతో పాటు పలు కుల సంఘాలు, వివిధ గ్రామాల ప్రజలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తాము నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన సమయంలోనే కాంగ్రెస్ నాయకులు మాదకద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించడం, దానికి పోలీసులు మద్దతు ఇవ్వడంపై ప్రశ్నలు లేవనెత్తారు. డబుల్ రోడ్డు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ నాయకుడు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి సస్పెన్షన్యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్షకు మద్దతుగా పాల్గొన్న మాజీ యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ, కాంగ్రెస్ నాయకుడు అల్లూరి శ్రీనాథ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునీల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.ఈ సందర్భంగా అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు రాజకీయాల కంటే రోడ్డు సమస్యే ప్రధానమని, ప్రజల సమస్య పరిష్కారం కోసం ఇకముందు కూడా ఉద్యమిస్తానని తెలిపారు.
పలువురు నాయకుల పాల్గొనడంఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మడుగుల రవీందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, సీపీఐ మండల కార్యదర్శి చొక్కల్ల శ్రీశైలం, గూడూరి సురేష్, తాడూరి వంశీకృష్ణ రెడ్డి, బోయిని కుమార్, మచ్చ సాయికృష్ణ, మీసాల ప్రభాకర్, సీపీఐ నాయకులు కాంతాల అంజిరెడ్డి, మీసం లచ్చన్న, బొమ్మకంటి అంజయ్యచారి, యువజన సంఘాల నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )