Logo
Date of Publish : 10 August 2026, 6:09 am
Editor : Katta Ravindar

గన్నేరువరంలో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం కలకలం

కరీంనగర్ జిల్లా తెలుగు కే న్యూస్  గన్నేరువరం మండల కేంద్రంలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
స్థానికుల వివరాల ప్రకారం.. గన్నేరువరం గ్రామానికి చెందిన వృద్ధురాలు కుర్ర ఎల్లవ్వ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.తనను కుర్ర తిరుపతి, కుర్ర హరీష్ వేధింపులకు గురిచేస్తున్నారని ఎల్లవ్వ ఆరోపించింది.తన సమస్య పరిష్కారం కోసం గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలను ఆశ్రయించినప్పటికీ.. తనకు సహాయం చేయడానికి వచ్చిన వారిపైనే కేసులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.తాను ఎవరి దగ్గరకు వెళ్లినా.. వారిపై కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని వృద్ధురాలు ఆరోపించింది.అంతేకాకుండా.. తన స్థలంలో ఇల్లు నిర్మించుకోకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎల్లవ్వ తెలిపింది.గ్రామపంచాయతీకి వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నించినా.. అక్కడ సహాయం చేయడానికి వచ్చిన వారిపైనే కేసులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ వేధింపులను భరించలేకే తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వృద్ధురాలు చెప్పుకొచ్చింది.ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి.. నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని, తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు కోరుతోంది.ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )