Logo
Date of Publish : 17 July 2026, 2:27 pm
Editor : Katta Ravindar

గౌరవెళ్లి ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలి: బీఆర్ఎస్

తెలుగు కే న్యూస్ | జూలై 17
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెళ్లి ప్రాజెక్టును శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు సందర్శించి అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు సూద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌరవెళ్లి ప్రాజెక్టు పనులు 98 శాతం పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా మిగిలిన పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు.
ప్రాజెక్టులో నీరు నింపితే ప్రాంతంలోని వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగునీటి సమస్య తీరుతుందని తెలిపారు. వరద కాలువల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు తగిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మేదిని వెంకటస్వామి, యాస శ్రీనివాస్, ఇంద్రాల సారయ్య, అయిలేని గాల్‌రెడ్డి, గుగులోతు తిరుపతి నాయక్, ఇరుగు రమేష్, నాంపల్లి శంకర్, మాటూరి రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )