పాల్గొన్న ప్రముఖులు.. ఘనంగా సన్మానం
శేరిలింగంపల్లి, తెలుగు కే న్యూస్:
ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సేవకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనకమామిడి నరేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు హఫీజ్‌పేట్‌లోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు హాజరై నరేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్ నరేందర్ గౌడ్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు నాయకులు, అభిమానులు భారీ గజమాలతో సత్కరించడంతో పాటు శాలువాలు, పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలను అందజేశారు. నరేందర్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పెద్దలు ఆయనను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో బాలింగ్ గౌతమ్ గౌడ్, నిమ్మల ధాత్రినాథ్ గౌడ్, శ్రీనివాస్, రాము గౌడ్, ఏ. శంకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రామ్ చందర్ గౌడ్, వెంకట్ జెమినీ, దేవేందర్ ముదిరాజ్, పాండు ముదిరాజ్, వినయ్ గౌడ్, రాజేశ్, పింటూ, ప్రవీణ్, విష్ణు, భాస్కర్, లింగం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనపై అభిమానంతో వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఆప్యాయతను ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు.