Logo
Date of Publish : 10 September 2026, 5:14 pm
Editor : Katta Ravindar

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన మహనీయురాలు, బహుజన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత, మహిళా చైతన్యానికి మార్గదర్శకురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె దివ్య స్మృతికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు

ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ భూమి, హక్కులు, ఆత్మగౌరవం కోసం నాటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

మహిళల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో చాకలి ఐలమ్మ గారి జీవితం నేటి తరానికి కూడా ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో. కామారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు గడ్డమీది మహేష్,డిసిసి ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్,డిసిసి జనరల్ సెక్రెటరీ జూలూరి సుధాకర్,మాజీ కౌన్సిలర్లు,పంపరి శ్రీనివాస్, తాటి ప్రసాద్, చాట్ల వంశీ, గౌరీ నవీన్, బాలు,ఈ మ్రోస్,బల్ల శ్రీనివాస్, బండారి శ్రీకాంత్, పండు శ్రీకాంత్,ఉన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )