[caption id="attachment_5895" align="alignright" width="1600"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట మండల కేంద్రంలో:- గాంధీ విగ్రహం వద్ద చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ 43వ వర్ధంతిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఐలమ్మ చిత్రపటానికి సిపిఎం పార్టీ నాయకులు నాయక్ వాడి శ్రీనివాస్. ఉత్సవ కమిటీ కార్యదర్శి వడ్డె రవి. పి ఓ డబ్ల్యు శ్రీ విముక్తి మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోసాని పూలమాలలు వేసే నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పాలకుర్తిలో విష్ణురు రామచంద్రారెడ్డి దొరకు వ్యతిరేకంగా తాను కౌలుకు భూమి తీసుకుని సాగు చేసుకుని ఆ పంట పైన దొర పెత్తనానికి వ్యతిరేకంగా ఐలమ్మ నిలబడి ఆంధ్ర మహా సభ కమ్యూనిస్టులు వారి సహకారంతో తన పంటను కోసుకొని ఇంటికి తేవడంతో దొర ఒక మహిళ తక్కువ కులానికి చెందిన వ్యక్తి పంట కోసుకుపోవడాన్ని జీర్ణించుకోలేక ఆమెపై దాడి చేసి వారి కుమారులను పోలీస్ పోలీసులతో కొట్టించి అక్రమ కేసులు బనాయించడం జరిగింది. అయినా ఐలమ్మ చెక్కుచెదరకుండా కమ్యూనిస్టుల మద్దతుతో ముందుకు వెళ్తున్న క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరకు విసునూరు రామచంద్రారెడ్డి కుమారుడిని గడిలో వేసి ఆంధ్ర మహాసభ వారందరూ కాల్చి వేయడం జరిగింది చివరకు అజ్ఞాతవాసంలో వెళ్లి తుపాకీ బట్టి తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ముందున్న ఐలమ్మకు మల్లు స్వరాజ్యం రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహా నాయకులు మద్దతుగా నిలిచి చివరకు నిజం ప్రభుత్వాన్ని ఇండియా కలిసే వరకు సాయుధ పోరాటం నిర్వహించిన వీరవనిత అని అన్నారు అలాంటి ఐలమ్మ విగ్రహాన్ని నవీపేట మండల కేంద్రంలో నిర్మించుకుంటే అన్ని రకాల పర్మిషన్లు ఉన్నా చివరకు కేసులు పెట్టి విగ్రహం ప్రారంభంకు నోచుకోకుండా ఇరిగేషన్ అధికారులు మొండి వైఖరిని తప్పుపట్టారు ఇప్పటికైనా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు స్పందించి స్థానిక అధికారులతో మాట్లాడి సుదర్శన్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ చేయాలని అన్నారు లేనియెడల సెప్టెంబర్ 26న ఆమె జయంతి నాటి వరకు ఈ ముసుకు తీయకుంటే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని మేమే ప్రారంభించుకోవాల్సి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు మహబూబ్. సావిత్రి. ఖురేషి కెవిపిఎస్ నాయకులు గౌతమ్ ఎస్ఎఫ్ఐ నాయకులు గోవింద్ ఐద్వా మహిళా సంఘం నాయకురాలు సావిత్రి తదితరులు పాల్గొన్నారు.[/caption]