Logo
Date of Publish : 15 July 2026, 1:55 pm
Editor : Katta Ravindar

చిన్నకోడూరు పోలీసులు వరుస వాహన దొంగతనాల కేసులు ఛేదించారు

సిద్ధిపేట,K24న్యూస్ తెలుగు జూలై 15: చిన్నకోడూరు పోలీసులు వరుస వాహన దొంగతనాల కేసులను ఛేదించి ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు ఆటోలు, ఒక పల్సర్ బైక్, ఒక హోండా యాక్టివా స్కూటీతో పాటు మూడు మాస్టర్ కీలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మద్యానికి బానిసై డబ్బు కోసం రాత్రివేళల్లో నిర్లక్ష్యంగా పార్క్ చేసిన వాహనాలను దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో చిన్నకోడూరు, సిద్ధిపేట వన్‌టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన వాహనాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )