Logo
Date of Publish : 10 September 2026, 6:21 am
Editor : Katta Ravindar

చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది అభంగపట్నంలో నూతన అంగన్వాడీ భవనానికి భూమిపూజ

[caption id="attachment_5864" align="alignright" width="1600"] నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలంలోని అభంగపట్నం గ్రామంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి గైని వసంత సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భవన నిర్మాణ పనులకు ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గైని వసంత సతీష్ మాట్లాడుతూ గ్రామంలోని చిన్నారులకు మెరుగైన విద్యా, పోషకాహార మరియు ఆరోగ్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. భవనం పూర్తయిన అనంతరం చిన్నారులకు మరింత అనుకూలమైన వాతావరణంలో సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపి గౌడ్, పంచాయతీ కార్యదర్శి టి.ప్రియాంక, అంగన్వాడీ సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి, హైస్కూల్ ప్రిన్సిపాల్ మల్లేష్ పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు లక్ష్మి నర్సవ్వ, శెట్పల్లి పవన్, బేతి రమ్య, కొండ్ర గంగాధర్, బేగరి సురేష్, అసది సవితతో పాటు గ్రామ పెద్దలు మారట నగేష్, గొల్ల గంగన్న, మంత గంగన్న, బొర్రా సురేష్, బేతి నారాయణరెడ్డి, అంతకోళ్ల శ్రీనివాస్, పులి సాయిలు, మంత సాయన్న, రెమ్మ పోచయ్య, కొండ్ర రాజు, చాకలి జనార్దన్, శాల నర్సయ్య తదితరులు హాజరయ్యారు.
గ్రామాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ అంగన్వాడీ భవనం నిర్మాణం చిన్నారుల విద్యా వికాసానికి, సంక్షేమానికి దోహదపడుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )