Logo
Date of Publish : 15 September 2026, 7:48 pm
Editor : Katta Ravindar

ఛలో ఐటీడీఏ ను విజయవంతం చేయండి  –తుడుం దెబ్బ మండలాధ్యక్షుడు సూర్ పటేల్ 

 

లక్షెట్టిపేట, సెప్టెంబర్ 15 (తెలుగు 24 కెన్యూస్ )

నేడు ఉట్నూర్‌లో నిర్వహించనున్న ఛలో ఐటీడీఏ ఆదివాసీ మార్చ్ కు పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలి రావాలని ఆదివాసీ తుడుం దెబ్బ మండలాధ్యక్షుడు జూగునాక సూర్ పటేల్ ప్రకటించారు.మంగళవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో ఛలో ఐటీడీఏ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 1/70 గిరిజన చట్టాన్ని రద్దు చేసింది, లంబాడాలను ఎస్టీ హోదా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్య నేటికి పరిష్కారానికి నోచుకోవడం లేదు. గిరిజన గ్రామాల్లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించడం లేదని వాపోయారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం. ఎన్నికల సమయంలోనే ఆదివాసీలు దేశానికి మూల వాసులని పొగడటం ఆ తర్వాత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తలమల నుంచి లక్షెట్టిపేటకు రావడానికి రోడ్డు సౌకర్యం లేదని, వర్షపు బురదలో ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ప్రభుత్వం తమ న్యాయమైన హక్కులను నెరవేర్చడం.ఆదివాసీలు ఛలో ఐటీడీఏ ఉట్నూర్ ద్వారా ప్రభుత్వానికి తమ గళాన్ని వినిపించాలని ఈ సమావేశంలో ఆదివాసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు మెస్రం చిత్రాలు,వర్కింగ్ ప్రెసిడెంట్ బద్ది చిన్నయ్య,నాయకుడు బద్ది ధర్మయ్య, జూగునాక జగన్, బద్ది చంటి, కుర్సెంగా విజయ్ కుమార్, పూసంతారామ్ ఉన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )