Logo
Date of Publish : 15 July 2026, 2:01 pm
Editor : Katta Ravindar

జఫర్‌గడ్‌లో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

జఫర్‌గడ్, జూలై 15 (కే24 న్యూస్): జఫర్‌గడ్ మండలంలో బుధవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నాగేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ వైఫల్యాలపై చైతన్యం తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )