కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్లో మొత్తం 11 మోటార్ వాహన ప్రమాద (Motor Accident) కేసులు రాజీ మార్గంలో పరిష్కరించబడ్డాయి.
ఈ కేసుల్లో ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు మరియు గాయపడిన బాధితులకు కలిపి మొత్తం రూ.1,17,66,000/- (ఒక కోటి పదిహేడు లక్షల అరవై ఆరు వేల రూపాయలు) పరిహారంగా అవార్డు చేయబడింది.
లోక్ అదాలత్ ద్వారా కేసులను సత్వరంగా పరిష్కరించడంతో బాధితులకు దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియ లేకుండా త్వరితగతిన పరిహారం అందే అవకాశం కలిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారులు తెలిపారు.
ప్రజలు లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకొని, పరస్పర అంగీకారంతో తమ వివాదాలను సత్వరంగా పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు.