Logo
Date of Publish : 23 September 2026, 8:07 pm
Editor : Katta Ravindar

టేక్రియల్ చెరువు గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి జిల్లా సెప్టెంబర్23:k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి పట్టణంలోని కల్కి గణేష్ మండలి, ఏకదంత గణేష్ మండలి, శివసేన గణేష్ మండలి, పాన్ చౌరస్తాలోని బాల గణేష్ మండపాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గణేష్ విగ్రహాలను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లు, నిమజ్జనానికి తరలించే విధానం, భక్తుల రద్దీ తదితర అంశాలను ఎస్పీ పరిశీలించారు. గణేష్ ఉత్సవ నిర్వాహకులతో స్వయంగా మాట్లాడి నిమజ్జన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. నిమజ్జన ఊరేగింపు సమయంలో భక్తులు, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రశాంతంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించారు.

చిన్నారులతో ఎస్పీ ఆప్యాయత

గణేష్ మండపాల సందర్శన సందర్భంగా అక్కడ ఉన్న చిన్నారులను జిల్లా ఎస్పీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. గణేష్ ఉత్సవాలను ఆనందంగా జరుపుకుంటూనే భద్రతా జాగ్రత్తలు పాటించాలని, భవిష్యత్తులోనూ గణేష్ వేడుకలను బాధ్యతగా నిర్వహించుకోవాలని చిన్నారులకు ప్రేమగా సూచించారు.

అనంతరం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్రియాల్ చెరువు నిమజ్జన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్, దేవునిపల్లి ఎస్‌ఐ రంజిత్‌లకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రత, పార్కింగ్, గజ ఈతగాళ్ల అందుబాటు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

గణేష్ నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా గణేష్ ఉత్సవ కమిటీలు, భక్తులు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. ప్రతి ఒక్కరి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నిమజ్జన కార్యక్రమాలను సురక్షితంగా నిర్వహించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్, దేవునిపల్లి ఎస్‌ఐ రంజిత్, పోలీసు సిబ్బంది, గణేష్ ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )