కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డి మున్సిపాల్ పరిధిలోని 13వార్డు టేక్రియల్ గ్రామ చివర దర్గా వద్ద వర్షం పడటం వల్ల రోడ్డు కుంగిపోయి గ్రామస్తులకు ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. చందాపూర్, సంగోజివాడి, కాలోజీవాడి, బ్రాహ్మణపల్లి, వచ్చే వాహనాలు టేక్రియల్ మీదుగా కామారెడ్డి వెళ్తాయని గ్రామస్తులు తెలిపారు. వర్షం పడటం వల్ల ఇంకా ఇబ్బందిగా ఉంటుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి వేళల్లో వచ్చే వాహనాలకు ప్రమాదం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దృష్టికి తెలియజేశారు. ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ ఫిర్యాదు ఇచ్చి వెంటనే చర్యలు, మరమ్మతులు చేపట్టి గ్రామానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామస్తులు కలెక్టర్ కు తెలియజేశారు.