Logo
Date of Publish : 31 August 2026, 10:30 am
Editor : Katta Ravindar

టేక్రియల్ లో వనమహోత్సవం,స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

కామారెడ్డి జిల్లా:k24 న్యూస్ తెలుగు : జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో వనమహోత్సవం మరియు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఛైర్పర్సన్ పిలుపునిచ్చారు.

అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చైర్‌పర్సన్ తెలిపారు.

పచ్చదనం పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అలాగే అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో DE హన్మాంతరావు, కౌన్సిలర్స్ లలిత చిట్టిబాబు ,అంజాద్,వాజీద్,బబ్లు, జావీద్, సిద్దిక్, సత్యం, భాస్కర్ గౌడ్, మున్సిపల్ అధికారులు అక్తర్, వార్డు ఆఫీసర్ వినయ్ ,ప్రభుత్వ పాఠశాల & కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థులు, ఆశావర్కర్స్, వార్డు ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )