Logo
Date of Publish : 17 August 2026, 12:12 pm
Editor : Katta Ravindar

ట్యాంక్ బండ్ పై పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు హర్షణీయం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్ష్యం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపన్న గౌడ్ 366 జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు18వ తేదీన సాయంత్రం 4గంటలకు ఆవిష్కరించనున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రజా పాలనలో గౌడ కులస్తులకు సరైన గౌరవం దక్కిందనడానికి ఇదే నిదర్శనమన్నారు ప్రజా ప్రభుత్వం విగ్రహ ఏర్పాటుకు మాట ఇచ్చి తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి పక్కన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి గౌడ సోదరులు ఎల్లపుడు రుణపడి ఉంటారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వం పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు,మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు,టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి, ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్ కు, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కు ,బీసీ, సంఘాల గౌడ సంఘాల ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు, సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ పెద్ద సంఖ్యలో జిల్లాలోని గౌడ సోదరులందరూ హైదరాబాద్ కు తరలిరావాలని ఆయన కోరారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )