Logo
Date of Publish : 03 October 2026, 5:32 pm
Editor : Katta Ravindar

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి జైపూర్ ఎసిపి

జైపూర్, అక్టోబర్ 3 తెలుగు కే న్యూస్ ప్రతినిధి గంగాధరి రాజయ్య

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు , సీఐ నవీన్ కుమార్ తో కలిసి జైపూర్ ఎస్‌ఐ బుమేష్ ఆధ్వర్యంలో శనివారం నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు జైపూర్ పరిధిలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 55 ఈ-చలాన్లు విధించారు. అలాగే రెండు డీడీ కేసులు నమోదు చేశారు. నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతున్న ఐదు వాహనాలను గుర్తించి, వెంటనే నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించారు.వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపవద్దని పోలీసులు సూచించారు. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )