Logo
Date of Publish : 01 July 2026, 10:58 am
Editor : Katta Ravindar

డీఈవో కార్యాలయాన్ని ముట్టడించిన టీజీవీపీ నాయకులు

కామారెడ్డి జిల్లా : తెలుగు K24 న్యూస్
ప్రైవేటు పాఠశాలల్లో నోట్‌బుక్స్, యూనిఫాంల పేరుతో అధిక వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో కామారెడ్డి డీఈవో కార్యాలయాన్ని ముట్టడించారు.
టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్ మాట్లాడుతూ, జూన్ 17న వినతిపత్రం ఇచ్చినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు అందించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వెయ్యి మంది విద్యార్థులతో మళ్లీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )