Logo
Date of Publish : 14 September 2026, 8:46 pm
Editor : Katta Ravindar

డీజే పెడితే తప్పసారిగా కఠిన చర్యలు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వజ్జపల్లి లో డీజే నిషేధ నిబంధనల ఉల్లంఘనపై కేసు – డీజే సామగ్రి సీజ్ వజ్జేపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డీజే నిర్వహణ

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వజ్జేపల్లి గ్రామంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా డీజే నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారనే గ్రామస్థుల ఫిర్యాదు మేరకు సదాశివనగర్ పోలీసులు చర్యలు చేపట్టారు.

డీజే నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, పోలీస్ శాఖ సూచనలు మరియు నిబంధనలను ఇప్పటికే స్పష్టంగా తెలియజేసినప్పటికీ, వాటిని ఉల్లంఘిస్తూ Dhagad యూత్ ఆధ్వర్యంలో డీజే నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సంబంధిత నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

అదేవిధంగా డీజే యజమాని మరియు ఆపరేటర్‌పై కూడా కేసు నమోదు చేసి, డీజేకు సంబంధించిన వాహనం మరియు సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు.

సీజ్ చేసిన సామగ్రి

1. Eicher Vehicle – TS12EH6901
2. 1500W Bass – 1
3. 6HF Top Speakers – 1
4. Amplifiers – 3
5. 20 KVA Generator – 1
6. Trust Stand – 1
7. Mixer – 1
8. Lenovo Laptop – 1

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మరియు పోలీస్ శాఖ సూచనలకు విరుద్ధంగా డీజేలు నిర్వహిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సదాశివనగర్ పోలీసులు తెలిపారు.

ప్రజల శాంతి, భద్రత మరియు ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు డీజే నిషేధ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

“సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. శాంతియుత వాతావరణం కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి.”


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )