Logo
Date of Publish : 01 October 2026, 7:09 pm
Editor : Katta Ravindar

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 57 మందికి రూ.5.60 లక్షల జరిమానా

ఐదుగురికి జైలు శిక్ష.. లైసెన్స్ లేని 33 మందికి రూ.1.65 లక్షల ఫైన్

సిద్ధిపేట, తెలుగు కే న్యూస్ అక్టోబర్ 1: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 57 మందికి న్యాయస్థానం రూ.5.60 లక్షల జరిమానా విధించగా, ఐదుగురికి జైలు శిక్ష విధించింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 33 మందికి రూ.1.65 లక్షల జరిమానా విధించినట్లు సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ చెట్టుక్రింది ముత్యం రాజు తెలిపారు.సిద్ధిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు గత కొన్ని రోజులుగా నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 57 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. ఈ కేసులను సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరచగా, విచారణ అనంతరం ముగ్గురికి 10 రోజుల చొప్పున, మరో ఇద్దరికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు. వీరితో పాటు మొత్తం రూ.5,60,000 జరిమానా విధించారు.జైలు శిక్షకు గురైన వారిలో మహ్మద్ ముజాహిద్ (పెద్దపల్లి జిల్లా), ఉసిరికపల్లి మల్లేశం (సంగారెడ్డి జిల్లా), ముఖేష్ సింగ్ (మధ్యప్రదేశ్), ముంజల రవి (వరంగల్ జిల్లా), కట్ట శంకర్ (నల్గొండ జిల్లా) ఉన్నారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ముత్యం రాజు మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల వాహనదారుల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10 వేల జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే రూ.5 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష వంటి చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
చెట్టుక్రింది ముత్యం రాజు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, సిద్ధిపేట


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )