Logo
Date of Publish : 18 September 2026, 7:40 pm
Editor : Katta Ravindar

తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన పంతులు తండా సర్పంచ్ చిన్నా నాయక్ బృందం

హుస్నాబాద్, తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 18:
తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి, గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పంతులు తండా గ్రామ సర్పంచ్ చిన్నా నాయక్ ఆధ్వర్యంలోని బృందం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది.
అక్కన్నపేట మండలంలో అనేక పంచాయతీ తండాలు ఉన్నాయని, ఆయా తండాల్లో రహదారులు, మౌలిక వసతులు తదితర సమస్యలతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాలు, తండాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ చిన్నా నాయక్ తెలిపారు. తండాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )